Nirbhaya: డెత్​ వారెంట్​ పై ‘స్టే’ కోరిన నిర్భయ దోషి

Nirbhaya convict Akshay Thakur stay petetion on Death warrant

  • మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఉరి  అమలు
  • పిటిషన్ దాఖలు చేసిన అక్షయ్ తరఫు న్యాయవాది
  • క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న కారణంగా ‘స్టే’ విధించాలని వినతి

నిర్భయ దోషులు నలుగురికి మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాలని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ తరఫు న్యాయవాది దీనిపై ‘స్టే’ కోరుతూ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న కారణంగా డెత్ వారెంట్ పై ‘స్టే’ విధించాలని కోరారు. ఈ పిటిషన్ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.

Nirbhaya
convict
death warrant
Stay
patiyala house court
  • Loading...

More Telugu News