Gopichand: తేజ సినిమాలో 'అలమేలుమంగ'గా కీర్తి సురేశ్

Teja Movie

  • తేజ దర్శకత్వంలో రెండు సినిమాలు 
  • గోపీచంద్ సరసన కీర్తి సురేశ్ 
  • రానాతో కాజల్ జోడీకట్టే ఛాన్స్  

సాధారణంగా తేజ ఒక సినిమా తరువాత మరో సినిమా ప్లాన్ చేస్తుంటాడు. కానీ అందుకు భిన్నంగా ఈ సారి ఆయన రెండు సినిమాలను ప్రకటించాడు. 'రాక్షసరాజు రావణాసురుడు' .. 'అలమేలుమంగ - వెంకటరమణ' టైటిల్స్ ను ఆయన రిజిస్టర్ చేయించాడు. 'రాక్షసరాజు రావణాసురుడు' సినిమాలో కథానాయకుడిగా రానా కనిపించనున్నాడు.

 ఇక 'అలమేలు మంగ - వెంకటరమణ'లో కథానాయకుడిగా గోపీచంద్ చేయనున్నాడు. ఈ సినిమాలో నాయిక పాత్రకి కాజల్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తి సురేశ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే కాజల్ తో పాటు కీర్తి సురేశ్ ను తీసుకున్నారా? లేదంటే కాజల్ కి బదులుగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. ఒకవేళ కాజల్ ఈ సినిమాలో లేకపోతే, రానాతో చేయనున్న ప్రాజెక్టులోకి వెళ్లే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Gopichand
Kajal Agarwal
Keerthi Suresh
Teja Movie
  • Loading...

More Telugu News