Asaduddin Owaisi: ఆపన్నుల పట్ల కేసీఆర్‌, కలెక్టర్‌ ల స్పందనను మెచ్చుకున్న అసదుద్దీన్‌ ఒవైసీ

This is a good way of solving poor people problems asaddin

  • కారు ఆపి వృద్ధుడి సమస్యలు విన్న కేసీఆర్‌
  • మెట్లపై కూర్చొని వృద్ధురాలి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్‌
  • ఇద్దరి ఫొటోలు పోస్ట్ చేసిన ఒవైసీ
  • అందరూ పాటించాలని వినతి 

సాయం కోసం ఎదురు చూస్తోన్న వారికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ చేసిన సాయం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మంత్ర ముగ్ధుడయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన పోస్ట్ చేసి ప్రశంసల జల్లు కురిపించారు.

ఇటీవల హైదరాబాద్‌ టోలిచౌకిలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తున్న కేసీఆర్‌.. మార్గమధ్యంలో చేతిలో దరఖాస్తు పట్టుకున్న వృద్ధుడిని చూసిన వెంటనే కాన్వాయ్‌ను ఆపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్‌.. వృద్ధుడు మహ్మద్‌ సలీమ్‌ బాధను విని, వెంటనే ఆయన సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతిని ఆదేశించడంతో ఆయన సమస్యలు తీరాయి.  మరోవైపు పింఛన్‌ కోసం కలెక్టరేట్‌కు వచ్చి మెట్లపై కూర్చున్న ఓ వృద్ధురాలి వద్దకు వచ్చి తాను కూడా మెట్లపై కూర్చుని  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ వెంటనే స్పందించి పింఛన్‌ మంజూరు చేయించారు.

దీనిపై ఒవైసీ ట్వీట్ చేస్తూ.. 'పేదల సమస్యలు పరిష్కరించడానికి ఇదో చక్కటి మార్గం.. ఎంతో వినయాన్ని, ప్రజాధికార వ్యవస్థను చక్కగా చూపుతోంది. ఈ విషయానికి ఉదాహరణగా తెలంగాణ ముఖ్యమంత్రి, కలెక్టర్ అజీం సాబ్ చూపెట్టిన మార్గాన్ని అందరు సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్లు పాటించాలి' అని చెప్పారు.

Asaduddin Owaisi
Twitter
KCR
  • Error fetching data: Network response was not ok

More Telugu News