vishakha issue: విశాఖలో పులివెందుల రాజకీయాలు చేస్తున్నారు.. గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

pulivendula politics in visakha says TDP

  • మా అధినేత పర్యటనకు అనుమతిచ్చి అడ్డుకున్నారు
  • పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉంది
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. గురువారం విశాఖ పర్యటనకు వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడంపై గవర్నర్‌కు ఈరోజు  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనకు అన్ని అనుమతులు ఉన్నాయని, అయినా రాజకీయ కక్షతో అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో అలజడి రేపుతున్నారని, పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని కోరారు.

సీనియర్‌ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ తమ ఫిర్యాదుపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారన్నారు. విశాఖలో మొన్న జరిగిన ఘటన చూసి దేశం అంతా నవ్వుకుందన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబును రౌడీషీటర్లు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News