Budda Venkanna: అమ్మని ఓడించిన ఉత్తరాంధ్రని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు: బుద్ధా వెంకన్న

budda venkanna criticises vijay sai reddy and jagan

  • హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు వెళ్లకుండా ఇగో తీర్చుకున్నాడు
  • జీఎన్ రావు కమిటీలో ఉత్తరాంధ్ర ప్రమాదకర ప్రాంతమని రాయించారు
  • పెట్టుబడులు రాకుండా చావుదెబ్బ తీశాడు 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. 'అమ్మని ఓడించిన ఉత్తరాంధ్రని నాశనం చేయాలని జగన్‌ గారు కంకణం కట్టుకున్నాడు. హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు వెళ్లకుండా ఇగో తీర్చుకున్నాడు. ఇప్పుడు జీఎన్ రావు కమిటీలో ఉత్తరాంధ్ర ప్రమాదకర ప్రాంతం అని రాయించి పెట్టుబడులు రాకుండా చావుదెబ్బ తీశాడు' అని తెలిపారు.

'మూడు ముక్కలాట తుస్సుమనడంతో ఇతర జిల్లాల నుండి వైకాపా పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించి చంద్రబాబు గారి యాత్రకి అడ్డుపడ్డాడు. పబ్జీ ఆడుతున్నా చంద్రబాబు గారే కనిపిస్తున్నారు' అని ఎద్దేవా చేశారు.  

'శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని ఫోబియా వెంటాడుతుంది. ''చంద్రబాబు ఫోబియా'' తో వణికిపోతున్నారు. 151 సీట్లు అని కాలర్ ఎగరేసి 9 నెలలు కాకముందే చంద్రబాబు గారు సింగంలా ఏ1, ఏ2 లను బొక్కలో వేసినట్టు కలలు ఇబ్బంది పెడుతున్నాయి పాపం. అందుకే ఉదయం లేస్తే చంద్రబాబు నామజపం, అడ్డుకోవడం' అని పేర్కొన్నారు.

Budda Venkanna
Telugudesam
Jagan
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News