Nara Lokesh: పాపం జగన్‌ని చూస్తే బాధేస్తోంది...శుక్రవారం వస్తే స్కూల్‌ పిల్లాడిలా సాకులు వెతుకుతున్నాడు: నారా లోకేశ్ ఎద్దేవా

Every friday jagan looks like school student tweets lokesh

  • కోర్టుకు ఎగ్గొట్టడానికి నానా పాట్లు పడుతున్నాడు
  • మిగిలిన రోజులు పబ్జీతో కాలక్షేపం చేస్తున్నాడు
  • కోర్టు రోజు మాత్రం  సీఎంనన్న విషయం గుర్తుకు తెచ్చుకుంటాడు

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే జాలేస్తోందని, శుక్రవారం వచ్చేసరికి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలా అని స్కూల్‌ పిల్లాడిలా సాకులు వెతుక్కోవాల్సి వస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. వారంలో మిగిలిన రోజులు తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నజగన్‌ శుక్రవారం వచ్చేసరికి తాను సీఎంనని గుర్తుకు వచ్చి ఏదో పర్యటనో, రివ్యూనో పెట్టి కోర్టుకు రాలేనంటూ కబురు పంపుతుంటారని వ్యంగ్యోక్తి విసిరారు.

Nara Lokesh
CM jagan
Twitter
friday
court
  • Loading...

More Telugu News