Mumbai: ఆర్థిక రాజధాని ముంబయిలో ఉగ్ర కలకలం!

police declared Mumbai as no fly zone due to terrorist acts

  • దాడులు జరగవచ్చని నిఘావర్గాల సమాచారం
  • అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
  • చిన్న విమానాలు, డ్రోన్లపై నిషేధం

ముంబయి మహానగరంలో ఉగ్ర కలకలం మొదలయ్యింది. అసాంఘిక శక్తులు దాడులకు పాల్పడవచ్చునన్న నిఘావర్గాల హెచ్చరిక నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన తీర మహానగరం ముంబయిపై ఉగ్రవాదుల కన్ను ఎప్పుడూ ఉంటుంది. ఈ కారణంగానే భద్రతా బలగాలు అనుక్షణం నిఘా పెట్టి ఉంటారు.

తాజాగా నిఘా వర్గాల హెచ్చరికతో నగరాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించినట్టు ప్రజాసంబంధాల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ‘మాకు అందిన సమాచారం మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నగర గగనతలంలో చిన్న విమానాలు, డ్రోన్లు, పారాగ్లైడర్స్‌, బెలూన్లు, క్రాకర్లు, పతంగులు, లేజర్‌ లైట్లు వినియోగించరాదు. మార్చి 24వ తేదీ వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అయితే నిషేధం నుంచి ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మినహాయించాం’ అంటూ డీసీపీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News