BJP: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మునిసిపల్ కార్పొరేటర్ ఫిర్యాదు.. పరారీలో నేత!

Former Maharashtra BJP MLA booked for rape of Thane corporator

  • 1999 నుంచి వేధిస్తున్నాడని ఫిర్యాదు
  • నరేంద్ర మెహతా నుంచి హాని ఉందన్న బాధిత కార్పొరేటర్
  • పరారీలో ఉన్న మెహతా కోసం పోలీసుల గాలింపు

ముంబైకి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం కేసు నమోదైంది. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై వేధిస్తున్నాడంటూ థానే జిల్లాలోని భయాందర్ పట్టణానికి చెందిన మహిళా కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెహతాతోపాటు సంజయ్ తార్కర్ అనే మరో వ్యక్తిపైనా పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు మూడు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసినట్టు మిరా-భయాందర్ పోలీసులు తెలిపారు.

కార్పొరేటర్, నరేంద్ర మెహతాలు అభ్యంతరకరంగా ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెహతా తనను 1999 నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులకు అతడి నుంచి ముప్పు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత కార్పొరేటర్ పేర్కొన్నారు. మెహతా, తార్కర్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

BJP
Maharashtra
Narendra Mehta
Sanjay Tarkar
Rape case
  • Loading...

More Telugu News