Vijay Sai Reddy: కొత్తగా వచ్చిన రోగం 'పులివెందుల ఫోబియా'... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించాలన్న విజయసాయి రెడ్డి!
- తండ్రీ, కొడుకులను పట్టుకున్న రోగం
- ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా ఒకరు పులివెందుల నుంచేనట
- పేర్లు చెప్పకుండా విజయసాయి సెటైర్లు
వైద్య శాస్త్రంలో ఎక్కడా కనిపించని ఓ రోగం, రాష్ట్రంలోని తండ్రీ కొడుకులను పట్టుకుందని, దాని పేరు 'పులివెందుల ఫోబియా' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో సెటైర్లు వేశారు. ఎవరి పేరు చెప్పకుండానే ఆయన ఈ ట్వీట్ ను పెట్టినప్పటికీ, అది చంద్రబాబు, లోకేశ్ లను ఉద్దేశించినదేనని కామెంట్లు వస్తున్నాయి.
"వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు" అని విజయసాయి ట్వీట్ చేశారు.