Namita Mundada: నిండు గర్భిణి.. అయినా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే

Pregnant MLA Namita Mundada Attends Assembly Session

  • బీడ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నమిత
  • నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లేందుకు హాజరు
  • వైద్యుల సలహా పాటిస్తున్నట్టు చెప్పిన ఎమ్మెల్యే

నిండు గర్భిణి అయిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల నమిత ముందాడ బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. నిండు గర్భిణి అయినప్పటికీ తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఆమె అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్తానని, అందుకే గర్భంతోనూ సమావేశాలకు హాజరైనట్టు నమిత తెలిపారు. సమావేశాలకు వచ్చినప్పటికీ వైద్యుల సలహా పాటిస్తున్నట్టు తెలిపారు.

Namita Mundada
preganant MLA
BEED
Maharashtra
  • Loading...

More Telugu News