Sri Reddy: శ్రీరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకు డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఫిర్యాదు

Dance master Rakesh complains against Actress Sri Reddy

  • శ్రీరెడ్డి, కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ మధ్య ముదురుతున్న వివాదం
  • ఒకరిపై ఒకరు హత్యాయత్నం ఆరోపణలు
  • మూడు రోజుల క్రితం శ్రీరెడ్డి.. ఇప్పుడు రాకేశ్

సినీ నటి శ్రీరెడ్డి, ఆమె అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను చంపుతానని యూట్యూబ్, ఫేస్‌బుక్‌ ద్వారా బెదిరిస్తున్నారంటూ డ్యాన్స్ మాస్టర్ ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ (49) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు అపార్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అభిమాన సంఘం పేరుతో తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో వేధిస్తున్నారన్నారు. మూడు రోజుల్లో తనను చంపుతామని మరికొందరు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తమపై అసభ్యకర పోస్టులు చేసిందని ఆరోపిస్తూ నటి కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిగా శ్రీరెడ్డి కూడా కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్‌లపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇది జరిగి మూడు రోజులైనా కాకముందే ఇప్పుడు రాకేశ్ మాస్టర్ ఆమెపై ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Sri Reddy
Karate Kalyani
Dance master Rakesh
Tollywood
  • Loading...

More Telugu News