Payal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Payal plays IPS officer role

  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో అందాలభామ 
  • మహేశ్ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ 
  • తిరుపతిలో నిఖిల్ 'కార్తికేయ- 2'  

 *  'ఆర్ఎక్స్ 100', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న అందాలభామ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. నూతన దర్శకుడు ప్రణదీప్ దర్శకత్వం వహించే చిత్రంలో పాయల్ ఐపీఎస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్ర పోషించనుంది.   
*  మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయనున్నాడు. జూలై నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. కాగా, ఈ చిత్రానికి గోపీసుందర్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. గతంలో పరశురాం తీసిన 'గీత గోవిందం' చిత్రానికి గోపీసుందర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు.
*  నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల 2 నుంచి తిరుపతిలో నిర్వహిస్తారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఇది రూపొందుతుంది.

Payal
Mahesh Babu
Parashuram
Nikhil
  • Loading...

More Telugu News