Virat Kohli: రెండో టెస్టులోనూ మారని తీరు... లంచ్ కు ముందే పెవిలియన్ కు ఓపెనర్లు!

Openers Out in Second Test with New Zeland

  • క్రైస్ట్ చర్చ్ లో ప్రారంభమైన రెండో టెస్టు
  • 7 పరుగులకే మయాంక్ అవుట్
  • నిదానంగా ఆడుతున్న కోహ్లీ

న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో ఈ ఉదయం ప్రారంభమైన రెండో టెస్టులో భారత తీరు మారలేదు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై పేలవమైన షాట్లు ఆడిన ఓపెనర్లు పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్, భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించగా, ఓపెనర్ పృథ్వీ షా 54 పరుగులు చేసి కాస్తంత ఫర్వాలేదనిపించగా, మయాంక్ అగర్వాల్ 7 పరుగులకే అవుట్ అయ్యాడు.

ఆపై పుజారా (15 పరుగులు), విరాట్ కోహ్లీ (3) పరుగులతో ఇన్నింగ్స్ ను పునర్నిర్మించే పనిలో పడ్డారు. కోహ్లీ కాస్తంత నిదానంగా ఆడుతూ ఉండటంతో లంచ్ విరామ సమయానికి భారత జట్టు స్కోరు 23 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 85 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ కు ఒకటి, జేమీసన్ కు ఒక వికెట్ దక్కాయి.

Virat Kohli
India
Team New Zealand
Cricket
Cheteshwar Pujara
  • Loading...

More Telugu News