Yuvaraj Singh: పుట్టిన రోజట... గడ్డ కట్టించే చలిలో యువరాజ్ ను బయటకు తీసుకెళ్లిన హేజెల్ కీచ్!

Vuvaraj Singh hazel keech Visited Statue of Liberty

  • శుక్రవారం హేజెల్ కీచ్ పుట్టిన రోజు
  • సరదాగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద గడిపిన జంట
  • సోషల్ మీడియాలో పోస్ట్

టీమిండియా క్రికెట్ జట్టులో స్టార్ బ్యాట్స్ మెన్ గా ఎన్నో ఏళ్లు సేవలందించిన యువరాజ్ సింగ్, తన భార్య హేజెల్ కీచ్ కు విభిన్నంగా థ్యాంక్స్ చెప్పాడు. శుక్రవారం నాడు కీచ్ పుట్టిన రోజు కాగా, ఆమె, 33వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా యువీ శుభాకాంక్షలు తెలిపాడు.

తన భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఈ కపుల్ న్యూయార్క్ వెళ్లగా, ఇద్దరూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని సందర్శించారు. అక్కడ దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసిన యువీ, "హే హేజీ... నేడు నీ పుట్టిన రోజు. గడ్డ కట్టిస్తున్న చలిలో నన్ను బయటకు తీసుకు వచ్చావు. అందుకు ధన్యవాదాలు. ఇది నీ జన్మదినం కాబట్టి, రోజంతా గొప్పగా గడిపేయి. నా లవ్ హేజెల్ కీచ్" అని కామెంట్ పెట్టాడు. యువీ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కాగా, ప్రస్తుతం తన సోదరుడు జొరావర్ సింగ్ నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో యువీ, హేజెల్ కూడా నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్, ప్రస్తుతం ప్రైవేటు లీగ్ లకు మాత్రమే పరిమితమయ్యాడు.

Yuvaraj Singh
Hazel Keech
Birth Day
Statue of Liberty
  • Loading...

More Telugu News