Google Pay: గూగుల్ పేలో రూ. 3 వేలు పంపితే... పెనుకొండ వాసికి లక్ష క్యాష్ బ్యాక్!

Huge Cash back for Anantapur district Youth from Google Pay

  • స్నేహితునికి డబ్బు పంపిన సూర్యప్రకాశ్
  • కాసేపటికే బ్యాంకు ఖాతాలో క్యాష్ బ్యాక్
  • భారీ క్యాష్ బ్యాక్ రావడంతో ఆనందం

అనంతపురం జిల్లా పెనుకొండలో గూగుల్ పేను వినియోగించి మూడు వేల రూపాయలను తన స్నేహితునికి పంపిన యువకుడికి ఏకంగా రూ. 1,00,007 క్యాష్ బ్యాక్ వచ్చింది. దీంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. పట్టణానికి చెందిన సూర్య ప్రకాశ్ అనే యువకుడు, నగదును బదిలీ చేశాడు. ఆపై కాసేపటికే సూర్య ప్రకాశ్ బ్యాంకు ఖాతాకు లక్ష జమ అయినట్టు సమాచారం వచ్చింది. ఏ మాత్రమూ ఊహించని విధంగా పెద్ద మొత్తంలో డబ్బు రివార్డుగా లభించేసరికి ఆ ఆనందాన్ని మిత్రులతో పంచుకున్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News