Muralidhar rao: ఎన్నార్సీ చట్టం బీజేపీ కార్యాలయంలో తయారు చేసేది కాదు: మురళీధర్​ రావు

Bjp leader Muralidhar rao clarifies about NRC

  • ఎన్నార్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ లేదు
  • కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నాం
  • అసోంలో ఎన్నార్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది

ఎన్నార్సీ చట్టం బీజేపీ కార్యాలయంలో తయారు చేసేది కాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఎన్నార్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరపడం లేదని, కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు. అసోంలో ఎన్నార్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోందని, అక్కడ అమలవుతున్న ఎన్నార్సీ విధానాలే దేశ వ్యాప్తంగా అమలవుతాయని భావించలేమని అన్నారు. అసోంతో ఇతర రాష్ట్రాల పరిస్థితులను పోల్చలేమని అభిప్రాయపడ్డారు.

Muralidhar rao
BJP
NRC
Assam
  • Loading...

More Telugu News