Sabbam Hari: మళ్లీ ఎన్నికలకు చంద్రబాబు ఉండకూడదని కుట్ర చేస్తున్నారు: సబ్బం హరి

Political Analyist Sabbam Hari severe comments about Jagan

  • విశాఖ ఘటనలో కొందరు పోలీసులను గూండాలుగా వాడుకున్నారు
  • పోలీసులు యూనిఫాం లేకుండా వచ్చారు
  • వాళ్లకు నేమ్ ప్లేట్స్ కూడా లేవు

విశాఖలో చంద్రబాబును వైసీపీ నేతలు అడ్డుకోవడంపై మాజీ ఎంపీ సబ్బం హరి ఘాటుగా స్పందించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణాలు ప్రశాంతమైన ప్రాంతాలని, మూడు జిల్లాల్లోని ఎంపీలు ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని అన్నారు. ఈ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలలో ఒకరో ఇద్దరో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారే తప్ప మిగిలిన వాళ్లు సంస్కారంగానే ఉన్నారని అన్నారు.

జగన్ సీఎం అయ్యాక  రాష్ట్రాభివృద్ధి, రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనులు, విశాఖపట్టణం అభివృద్ధి గురించి, తరలిపోతున్న పరిశ్రమలను ఎలా ఆపాలన్న దానిపై ఆలోచన చేయకుండా, కేవలం, చంద్రబాబునే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబే తన శత్రువుగా భావిస్తున్న జగన్, మళ్లీ ఎన్నికలకు బాబు ఉండకూడదని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిన్నటి ఘటనలో కొందరు పోలీసులను గూండాలుగా వాడుకున్నారని, పోలీసులు యూనిఫాం లేకుండా వచ్చారని, నేమ్ ప్లేట్స్ కూడా లేవని ఆరోపించారు.

Sabbam Hari
political Analyist
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News