Etala Rajender: చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందనేది వట్టి అపోహ: మంత్రి ఈటల
- హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో చికెన్ మేళా
- హాజరైన మంత్రి ఈటల
- చికెన్ కు, కరోనా వైరస్ కు సంబంధం లేదని స్పష్టీకరణ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో భారత్ లో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. అమ్మకాలు లేక చికెన్ విక్రయదారులు ఉసూరుమంటున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టతనిచ్చారు. చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందన్నది వట్టి అపోహ మాత్రమేనని అన్నారు. తీసుకునే ఆహారం వల్ల కరోనా రాదని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉన్న భయం పోగొట్టేందుకు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో చికెన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఈటల, ప్రతి ఒక్కరూ నిర్భయంగా చికెన్, కోడిగుడ్లు తినొచ్చని పిలుపునిచ్చారు. కరోనా విషయంలో చికెన్ పై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేశారు.