Andhra Pradesh: మార్చి 4న ఏపీ మంత్రి వర్గ సమావేశం
![Ap cabinet meet on March 4th](https://imgd.ap7am.com/thumbnail/tn-af35e18f830e.jpg)
- వెలగపూడి సచివాలయంలో భేటీ కానున్న కేబినెట్
- సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం
- పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం
ఏపీ కేబినెట్ మరోమారు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో మార్చి 4న మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు సహా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.