Amaravati JAC: చిరంజీవి ఇంటిని ముట్టడించాలని మేం ఎలాంటి పిలుపు ఇవ్వలేదు: అమరావతి జేఏసీ

Amaravati JAC clarifies on Chiranjeevi residence obsession as a falls campaign

  • సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందన్న జేఏసీ కన్వీనర్
  • తప్పుడు ప్రచారంతో తమకు సంబంధం లేదని స్పష్టీకరణ
  • ఉద్యమాన్ని బలహీనపరిచే కుట్రలంటూ ఆరోపణలు

రాజధాని అమరావతి కోసం తాము సాగిస్తున్న ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము ప్రముఖ హీరో చిరంజీవి నివాసాన్ని ముట్టడించాలని పిలుపు ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి ఇంటి ముట్టడికి తాము ఎలాంటి పిలుపు ఇవ్వలేదని తిరుపతిరావు స్పష్టం చేశారు. కొన్ని సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో తమకు సంబంధం లేదని తెలిపారు. ఇలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మరాదని విజ్ఞప్తి చేశారు.

Amaravati JAC
Chiranjeevi
Tiruapati Rao
AP Capital
Andhra Pradesh
  • Loading...

More Telugu News