GVL Narasimha Rao: నిన్న విశాఖలో జరిగిన దానికంటే గతంలో టీడీపీ ఇంకా దారుణంగా వ్యవహరించింది: జీవీఎల్

GVL reacts over Chandrababu issue

  • చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తభరితం
  • ఇలాంటి పరిణామాలకు చంద్రబాబే కారకుడన్న జీవీఎల్
  • గతంలో కేంద్రాన్ని రాష్ట్రంలో అడుగుపెట్టవద్దన్నాడంటూ విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న విశాఖలో జరిగిన పరిణామాలకంటే గతంలో టీడీపీ ఇంకా దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు జరగడానికి కారకుడు చంద్రబాబేనని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రాన్ని రాష్ట్రంలో అడుగుపెట్టవద్దని చంద్రబాబు హుకుం జారీ చేయలేదా? అని నిలదీశారు. అయినా, ఓ నేతపై కోడిగుడ్లతో దాడి చేయడం సరైన సంస్కృతి కాదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని వైసీపీ, టీడీపీ నాశనం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

GVL Narasimha Rao
Chandrababu
Vizag
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News