Revanth Reddy: ఓ వృద్ధుడ్ని సీఎం కేసీఆర్ కలవడం అంతా ఓ నాటకం: రేవంత్ రెడ్డి

Revanth Reddy attacks CM KCR and KTR

  • కొడుకు ఊర్లు తిరుగుతుంటే, కేసీఆర్ హైదరాబాదులో తిరుగుతున్నాడని రేవంత్ వ్యాఖ్యలు
  • సురభి నాటకాలను మించిపోయేలా నాటకాలు ఆడుతున్నారని విమర్శలు
  • కూకట్ పల్లిలో 'పట్నం గోస' నిర్వహించిన రేవంత్ 

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. నిన్న సీఎం కేసీఆర్ హైదరాబాదులో సలీమ్ అనే వృద్ధుడ్ని కలిసి అతడి కష్టాలు తీర్చారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన రేవంత్ రెడ్డి, అదంతా ఓ నాటకమని కొట్టిపారేశారు. కొడుకు కేటీఆర్ ఊర్లు తిరుగుంటే సీఎం కేసీఆర్ హైదరాబాదులో తిరుగుతూ సురభి నాటకాలను మించిపోయేలా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ నేతలు సంపన్నులయ్యారని, పేదలకు మాత్రం ఇళ్లు లభించలేదని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ ఆర్భాటాలకు పోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. కూకట్ పల్లిలో నిర్వహించిన పట్నం గోస కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy
KCR
KTR
Hyderabad
Surabhi Drama
Telangana
  • Loading...

More Telugu News