Narasimha prasad: ‘మీరు పిలిచే పిచ్చి తుగ్లక్ నేను హై‘ అంటూ సీఎం జగన్​ పై టీడీపీ నేత సెటైర్లు

Tdp leader Narasimha prasad jibes at CM Jagan

  • పిచ్చి తుగ్లక్ వేషం వేసిన కడప జిల్లా టీడీపీ నేత నరసింహప్రసాద్
  • రైల్వేకోడూరు ప్రజలతో మాట్లాడుతూ నవ్వులు తెప్పించిన నరసింహ
  • దివంగత టీడీపీ నేత శివప్రసాద్ కు ఆయన అల్లుడు

ఏపీ సీఏం జగన్ తీరును కడప జిల్లా రైల్వే కోడూరు టీడీపీ నాయకుడు నరసింహ ప్రసాద్ వినూత్న రీతిలో ఎద్దేవా చేశారు. పిచ్చి తుగ్లక్ వేషం వేసిన నరసింహప్రసాద్ స్థానికంగా పర్యటిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ వాళ్లను నవ్వించారు. తుగ్లక్ కన్నా దారుణంగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖలో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్రను అడ్డుకోవడం నుంచి, మూడు రాజధానుల ఆలోచనను నిరిసిస్తూ తుగ్లక్ వేషం వేసినట్టు తెలిపారు.

‘మీరందరూ ‘పిచ్చి తుగ్లక్’ అంటారు కదా! ‘నేనే పిచ్చి తుగ్లక్. మీరు పిలిచే పిచ్చి తుగ్లక్ నేను హై.. మహ్మద్ బీన్ తుగ్లక్ హై. మాది వారసుడు ఇక్కడెక్కడో ఉన్నాడంటా, మీరు చూశారా? ఈ జిల్లాలోనే పుట్టాడంటా? మిమ్మల్ని పరిపాలిస్తున్నాడంటా. ‘పిచ్చి తుగ్లక్.. పిచ్చి తుగ్లక్’ అని కలవరిస్తున్నారు. దాదాపు ఏడువందల సంవత్సరాలుగా ప్రశాంతంగా నిద్ర పోతుంటే లేపారు. నన్నే అనుకుని లేచాను. తీరా చూస్తే, ‘నువ్వు కాదు‘ అంటున్నారు..’ అంటూ జగన్ ని విమర్శిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, గత అసెంబ్లీఎన్నికల్లో రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి నరసింహ ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. దివంగత టీడీపీ నేత శివప్రసాద్ కు ఆయన అల్లుడు అవుతారు. 

Narasimha prasad
Telugudesam
Jagan
YSRCP
Railwaykoduru
  • Loading...

More Telugu News