Jagan: 2021 నాటికి ‘పోలవరం’ పూర్తి చేయాలని సీఎం జగన్​ మార్గ నిర్దేశం

CM Jagan Guidelines to Officers Polavaram project to be completed by 2021

  • పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన జగన్
  • అనంతరం అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష
  • ఈ జూన్ లోగా స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి చేయాలని ఆదేశం

2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ మార్గ నిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టును జగన్ పరిశీలించిన అనంతరం అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో మాట్లాడారు.

 పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైందని, 2021 నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తేనే ప్రయోజనకరమని, గతంలో ప్రణాళిక, సమన్వయం, సమచార లోపాలు ఉండేవని, జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులోనూ పనులు జరగాలని, ప్రాజెక్టు పనులకు కలిగే అడ్డంకులపై దృష్టి పెట్టాలని, ఈ జూన్ లోగా స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి కావాలని, పనుల పర్యవేక్షణ, సత్వర అనుమతుల కోసం ఢిల్లీలో ఓ అధికారిని ఉంచాలని జగన్ ఆదేశించినట్టు సమాచారం.

డ్రాయింగ్స్, డిజైన్ల అనుమతి, లైజనింగ్ కు అధికారిని కేటాయించాలని, కుడి, ఎడమ కాల్వలను నిర్దేశిత సమయానికి వినియోగంలోకి తేవాలని, ఆదేశించిన జగన్, రెండు వైపుల టన్నెల్ తవ్వకం పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. జూన్ నాటికి కుడి ప్రధాన కాల్వ కనెక్టివిటీ పూర్తవుతుందని, ఎడమ కాల్వ కనెక్టివిటీకి 2 ప్యాకేజీల్లో పనులు జరుగుతున్నాయని జగన్ కు అధికారులు తెలియజేసినట్టు సమాచారం. 

Jagan
YSRCP
Andhra Pradesh
cm
Polavaram Project
  • Loading...

More Telugu News