Prithvi Shaw: రెండో టెస్టుకు పృథ్వీ షా ఫిట్​.. కోచ్​ శాస్త్రి ప్రకటన

Prithvi Shaw is fit and ready to go confirms Ravi Shastri

  • గాయం నుంచి కోలుకున్న షా.. నెట్స్‌లో ప్రాక్టీస్‌
  • అశ్విన్ స్థానంలో జడేజాను తీసుకోవచ్చని శాస్త్రి హింట్
  • రేపటి నుంచి న్యూజిలాండ్‌తో భారత్ రెండో టెస్ట్‌

టీమిండియా యువ ఓపెనర్‌‌ పృథ్వీ షా గాయం నుంచి కోలుకున్నాడు. న్యూజిలాండ్‌తో శనివారం మొదలయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు. షా ఫిట్‌గా ఉన్నాడని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రకటించాడు. ఎడమ పాదంలో వాపు రావడంతో గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు పృథ్వీ దూరమయ్యాడు. దాంతో, అతను రెండో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం కనిపించింది.

అయితే, శుక్రవారం జరిగిన నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పృథ్వీ పాల్గొన్నాడు. రవిశాస్త్రి సమక్షంలో సాధన చేసిన అతనికి కెప్టెన్‌ కోహ్లీ కొన్ని విలులైన సూచనలు చేశాడు. సెకండ్‌ టెస్టుకు పృథ్వీ రెడీగా ఉన్నాడని ప్రాక్టీస్ అనంతరం శాస్త్రి తెలిపాడు. ఇక, ఈ మ్యాచ్‌లో స్పిన్నర్‌‌ రవిచంద్రన్‌ అశ్విన్ స్థానంలో మరో స్పిన్నర్‌‌ రవీంద్ర జడేజాను బరిలోకి దింపే అవకాశం ఉందని శాస్త్రి హింట్ ఇచ్చాడు. మొదటి టెస్టులో బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన అశ్విన్‌ బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశ పరిచాడు. స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న జడేజా వస్తే జట్టు బలం పెరుగుతుందని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

Prithvi Shaw
fit
Team India
Team New Zealand
test match
  • Loading...

More Telugu News