Lakshmi Parvati: చంద్రబాబు అవినీతిపరుడు, స్వార్థపరుడు: లక్ష్మీపార్వతి

Chandrababu is corrupted and selfish says Lakshmi Parvathi

  • సొంత మామపై చెప్పులు వేయించారు
  • అమరావతి రైతులను మోసం చేస్తున్నారు
  • నందిగం సురేశ్ పై చంద్రబాబు డైరెక్షన్ లోనే దాడి చేశారు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒక అవినీతిపరుడు, స్వార్థపరుడని మండిపడ్డారు. సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులు వేయించారని అన్నారు. అందుకే చంద్రబాబుపై ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పులు వేస్తున్నారని తెలిపారు.

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను చంద్రబాబు అడ్డుకున్నారని... అందుకే ఆయనను విశాఖ ప్రజలు కదలనివ్వలేదని చెప్పారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై చంద్రబాబు డైరెక్షన్ లోనే దాడి చేశారని ఆరోపించారు. అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్టునే కాంగ్రెస్ నేతలు చదువుతున్నారని విమర్శించారు.

Lakshmi Parvati
YSRCP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News