Delhi: అల్లర్లతో అట్టుడుకుతున్న ఢిల్లీకి కొత్త పోలీస్ కమిషనర్

SN Srivastava appointed as Delhi new police commissioner

  • ఢిల్లీ కొత్వాల్ గా ఎస్ఎన్ శ్రీవాత్సవ 
  • రేపు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత కమిషనర్  
  • ఇటీవలే ఢిల్లీ స్పెషల్ కమిషనర్ గా నియమితుడైన శ్రీవాత్సవ

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కారణంగా ఢిల్లీలో చెలరేగిన నిరసన జ్వాలలు ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొన్నాయి. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయంటూ అనేకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాత్సవను నియమించారు. ఢిల్లీ అల్లర్లు మొదలైన తర్వాత శ్రీవాత్సవను స్పెషల్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) గా నియమించారు. ఆయన సీఆర్పీఎఫ్ కు చెందిన అధికారి.

ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న అమూల్య పట్నాయక్ రేపటితో పదవీ విరమణ చేయనున్నారు. అమూల్య పట్నాయక్ స్థానంలో శ్రీవాత్సవకు పోలీస్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయనే ఢిల్లీ కమిషనర్ గా కొనసాగుతారు. దీనిపై శ్రీవాత్సవ మాట్లాడుతూ, తాము భద్రంగా ఉన్నామనే భావనను ప్రజల్లో కలిగించడమే తన ప్రధాన కర్తవ్యమని, పోలీసులు ఉన్నది ప్రజల కోసమేనని వారిలో నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

Delhi
Police Commissioner
SN Srivastava
Amulya Patnaik
CAA
  • Loading...

More Telugu News