Shruti Haasan: నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా.. ఈ విషయం చెప్పేందుకు సిగ్గు పడను: శ్రుతి హాసన్

 Ive had plastic surgery which Im not ashamed to admit says Shruti Haasan

  • ఇది నా జీవితం.. ఇది నా ముఖం 
  • బాడీ షేమింగ్ చేసే వాళ్లకు శ్రుతి కౌంటర్

కమలహాసన్ కూతురు, హీరోయిన్ శ్రుతిహాసన్ సంచనల కామెంట్లు చేసింది. తనను బాడీ షేమింగ్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్య స్లిమ్ గా మారిన శ్రుతి.. కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో, కొంత మంది నెగిటివ్‌ కామెంట్లు చేశారు. మరీ సన్నగా మారిందని విమర్శించారు. కొన్ని అసభ్యకరమైన కామెంట్లు కూడా చేశారు. దాంతో, రెండు గంటల తర్వాత మరో రెండు ఫొటోలను పోస్ట్ చేసిన శ్రుతి వారికి కౌంటర్ ఇచ్చింది.

తన గురించి ఎవరేం అనుకున్నా పట్టించుకోనంది. అయితే, తన శరీరం గురించి తరచూ కామెంట్లు చేయడం మానుకోవాలని హితవు పలికింది. ఒకరి జీవితం గురించి మాట్లాడే అర్హత మరొకరికి లేదని స్పష్టం చేసింది. అలాగే, ముక్కు, పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వస్తున్న పుకార్లపై ఎట్టకేలకు మౌనం వీడింది. గతంలో తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని తెలిపింది. ఈ విషయం గురించి చెప్పేందుకు తానేమీ సిగ్గుపడడం లేదని స్పష్టం చేసింది.

ఇక, మహిళలు తరచూ ఎదుర్కొనే హార్మోన్ల ప్రభావం వల్ల తాను కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. తన శరీర మార్పులపై కామెంట్లు చేయడం సరైనది కాదంది. ‘ఇది నా జీవితం. ఇదే నా ముఖం అని నేను సంతోషంగా చెబుతున్నా. అవును, నేను గతంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. ఈ విషయం చెప్పేందుకు నేను సిగ్గు పడడం లేదు. అలాగని ప్లాస్టిక్ సర్జరీని ప్రమోట్ చేయలేదు. దాన్ని వ్యతిరేకించనూ లేదు. నేను ఎలా జీవించాలని అనుకున్నానో అలానే ఉంటున్నా. మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

Shruti Haasan
plastic surgery
body shaming
  • Loading...

More Telugu News