Avanthi Srinivas: ఇంటికి వెళ్లి తంతామని లోకేశ్ అంటున్నాడు, ఎవరింటికి వెళ్లి తంతాడో రమ్మనండి: ఏపీ మంత్రి అవంతి

AP minister Avanthi challenges Nara Lokesh

  • చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు ఆదిలోనే అడ్డంకి
  • వైసీపీ, టీడీపీ నేతల మధ్య మరింత ముదిరిన మాటల యుద్ధం
  • లోకేశ్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని అవంతి వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన అర్ధంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మరోసారి విమర్శల దాడి మొదలైంది. దీనిపై వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇంటికి వెళ్లి తంతామని లోకేశ్ అంటున్నాడని, ఎవరింటికి వెళ్లి తంతాడో లోకేశ్ ను రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. ప్రజలు వాళ్ల అసంతృప్తిని, అసహనాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారని, వాటిపై సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు. కానీ లోకేశ్ మాట్లాడుతున్న తీరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని విమర్శించారు.

Avanthi Srinivas
Nara Lokesh
Chandrababu
Vizag
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News