Ashok Babu: ఉత్తరాంధ్ర మీ జాగీరా?: మంత్రి బొత్సపై అశోక్ బాబు ఫైర్

Ashok Babu fires on Botsa Satyanarayana

  • ఉత్తరాంధ్రలో చంద్రబాబును తిరగనివ్వబోము అంటున్నారు
  • విశాఖ ప్రజలు టీడీపీనే గెలిపించారనే విషయాన్ని మర్చిపోవద్దు
  • ఏ1, ఏ2లు విశాఖలో భూకబ్జాలు చేస్తున్నారు

మాజీ సీఎం చంద్రబాబును ఉత్తరాంధ్రలో తిరగనివ్వబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారని... ఉత్తరాంధ్ర ఏమైనా ఆయన జాగీరా? అని టీడీపీ నేత అశోక్ బాబు మండిపడ్డారు. విశాఖలో చంద్రబాబును తిరగనివ్వబోమని అంటున్నారని... విశాఖను బొత్స రాయించుకున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా... విశాఖ ప్రజలు మాత్రం టీడీపీనే గెలిపించారనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. జగన్ సీఎం అయితే ఏమీ చేయరనే భావనతోనే టీడీపీని నాలుగు స్థానాల్లో గెలిపించారని అన్నారు.

పెయిడ్ ఆర్టిస్టులకు పచ్చ చీరలు కట్టించి ఒక ప్లాన్ ప్రకారమే చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడి చేయించారని అశోక్ బాబు విమర్శించారు. ఇక పథకం ప్రకారమే దాడి జరిగిందని చెప్పారు. ఏ1, ఏ2లు విశాఖలో భూకబ్జాలు చేస్తున్నారని... వీటిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని అన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటించి వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలు వివరిస్తామని చెప్పారు.

Ashok Babu
Chandrababu
Telugudesam
Botsa Satyanarayana
YSRCP
  • Loading...

More Telugu News