Chandrababu: అయ్యన్నపాత్రుడి కుమారుడి పెళ్లికి వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుపడింది: చంద్రబాబు

The government has prevented me from going to the wedding of Ayyanapatrus son blames Chandrababu

  • అయ్యన్నపాత్రుడు కుమారుడి పెళ్లి నేడు
  • తప్పకుండా హాజరుకావాల్సిన కార్యక్రమం
  • శుభకార్యానికి పోకుండా ప్రభుత్వం నన్ను అడ్డుకుంది

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడి పెళ్లి సందర్భంగా వధూవరులకు ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

'తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుగారు పార్టీ పట్ల, పేదల పట్ల ఎంతో నిబద్ధత కలిగిన నాయకులు. ఈరోజు విశాఖలో అయ్యన్న కుమారుడి పెళ్ళి. అంటే మా కుటుంబసభ్యుల శుభకార్యం కన్నా ముఖ్యమైనది. తప్పకుండా హాజరవ్వాల్సిన కార్యక్రమం. కానీ పైశాచిక, శాడిస్టు మనస్తత్వంతో వైసీపీ ప్రభుత్వం అరాచకంగా నన్ను అయ్యన్న ఇంటి శుభకార్యానికి పోనివ్వకుండా అడ్డుపడింది. అందుకే ట్విట్టర్ ద్వారా నూతన వధూవరులకు నా ఆశీస్సులు తెలియ చేస్తున్నాను. వారు కలకాలం ఆయురారోగ్య ఆనందాలతో ఉండాలని కోరుకుంటున్నాను' అని చంద్రబాబు ట్వీట్ చేశారు. దీంతోపాటు అయ్యన్నపాత్రుడుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

Chandrababu
Ayyanna Patrudu
Son
Marriage
Vizag
Telugudesam
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News