Ranga Reddy District: అంతర్రాష్ట్ర స్మగ్లర్లకు చెక్‌.. రూ.24 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

ganjai smauglers arrest

  • భద్రాచలం ఏజెన్సీ నుంచి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
  • 120 కేజీల సరుకు, రెండు కార్లు స్వాధీనం
  • ముగ్గురు అరెస్టు...మరో ఇద్దరు పరార్‌

అశ్వారావుపేట, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీగా గంజాయి సేకరించి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద మాటు వేశారు. అటుగా వస్తున్న రెండు కార్లను తనిఖీ చేయగా 120 కేజీల గంజాయి లభించింది. దీని విలువ 24 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారయ్యారు.  నిందితులను గండికోట కుమార్, నూనె విజయేందర్, రాజేశ్‌‌గా గుర్తించారు. పరారీలో ఉన్నవారిని రాజు, సమీర్‌‌లుగా గుర్తించి వెతుకుతున్నారు. వీరివద్ద నుంచి 2 కార్లు, రూ.1200 నగదు, 5 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Ranga Reddy District
pedaambarpeta
ganjai
three arrest
  • Loading...

More Telugu News