Uddhav Thackeray: ఇంత జరుగుతుంటే.. అమిత్ షా ఎక్కడున్నారు?: ఉద్ధవ్ థాకరే ఆగ్రహం

Where is Amit Shah asks Uddhav Thackeray

  • ఢిల్లీ అట్టుడుకుతుంటే అమిత్ షా ఎక్కడున్నారు?
  • అల్లర్ల గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నారు?
  • అజిత్ ధోవల్ మాత్రం ప్రజలతో మాట్లాడారు

హింసతో ఓ వైపు ఢిల్లీ అట్టుడుకుతుంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్కడున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ఆచూకీ తెలియడం లేదని... ఈ అల్లర్ల గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు.

అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కనిపించారని... అక్కడి ప్రజలతో మాట్లాడారని... కానీ, అమిత్ షా మాత్రం కనిపించలేదని అన్నారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో కనిపించిన అమిత్ షా... ఇప్పుడు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో 39 మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. అల్లర్లకు సంబంధించి 45 మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

Uddhav Thackeray
Shiv Sena
Amit Shah
BJP
Delhi Clashes
  • Loading...

More Telugu News