Andrea: బెడ్ రూమ్ సీన్లు చేసి చాలా తప్పు చేశా... ఇప్పుడు వాపోతున్న ఆండ్రియా!

Andrea Feels for Intemate Scenes in Vadachennai

  • 'వడ చెన్నై' చిత్రంలో నగ్నంగా నటించిన ఆండ్రియా
  • సినిమాలో సీన్లు తీసేసినా సోషల్ మీడియాలో వైరల్
  • అదే తరహా పాత్రలు వస్తున్నాయని ఆండ్రియా ఆవేదన

తాను బెడ్ రూమ్ సీన్లలో నటించి చాలా తప్పు చేశానని, ఇప్పుడు తనకు అటువంటి పాత్రలే అధికంగా వస్తున్నాయని నటి ఆండ్రియా వాపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'వడ చెన్నై'లో కొన్ని సీన్లలో ఆమె నగ్నంగా కనిపించింది. దీనిపై పెను వివాదం తలెత్తడంతో సినిమాలో ఆ సీన్లను తొలగించారు. అయినా అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ పడక సీన్ చేయడం తన పొరపాటై పోయిందని ఇప్పుడు అమ్మడు తీరికగా ఆవేదన వ్యక్తం చేస్తోంది. మంచి స్టోరీ తన ముందుకు వస్తే, తీసుకునే పారితోషికాన్ని తగ్గించుకునేందుకు సమ్మతమేనని అంటోంది. కాగా, కార్తితో 'ఆయిరత్తిల్ ఒరువన్', కమలహాసన్ తో 'విశ్వరూపం', అజిత్ తో 'మంగాత్త' తదితర హిట్ చిత్రాల్లో నటించిన ఈ కోలీవుడ్ భామ, ప్రస్తుతం 'మాళిగై', 'మాస్టర్', 'అరణ్మనై-3' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Andrea
Vadachennai
Intimate Scens
  • Loading...

More Telugu News