Tollywood: టీఎస్ ఆర్టీసీ బస్సులో 'భీష్మ' పైరసీ చిత్రం ప్రదర్శన.. అలాంటివి వద్దన్న కేటీఆర్!

Bheeshma piracy movie plays in TSRTC Bus

  • హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న బస్సులో ప్రదర్శన
  • మొబైల్‌లో వీడియో తీసి చిత్ర బృందానికి పంపిన ప్రయాణికుడు
  • ఫిలిం చాంబర్‌లో ఫిర్యాదు చేసిన నటుడు నితిన్

తెలంగాణ ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ సినిమాను ప్రదర్శించడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు వెళ్తున్న  టీఎస్ ఆర్టీసీ లగ్జరీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి ట్విట్టర్ ద్వారా చిత్ర బృందం దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన నటుడు నితిన్ ఫిలిం చాంబర్‌లోని  పైరసీ వ్యతిరేక విభాగం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. వారు నిన్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ సినిమాను ప్రదర్శించారంటూ ఆ సినిమా దర్శకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో పైరసీ చిత్రాలు ప్రదర్శించకుండా చూడాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సూచించారు.

Tollywood
Bheeshma
Actor Nitin
piracy
KTR
  • Loading...

More Telugu News