Sai Tej: మరో దర్శకుడిని లైన్లో పెట్టిన మెగా హీరో

Deva Katta Movie

  • 'ప్రతిరోజూ పండగే' సినిమాతో హిట్ 
  • సెట్స్ పై 'సోలో బ్రతుకే సో బెటర్'
  • జూన్లో పట్టాల పైకి దేవ కట్టా ప్రాజెక్ట్

ప్రస్తుతం సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా సుబ్బు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. మే 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలైన తరువాత నెలకి, మరో ప్రాజెక్టును సాయితేజ్ పట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి దేవ కట్టా దర్శకత్వం వహించనున్నాడు.

'డైనమేట్'..'ఆటో నగర్ సూర్య' వంటి చిత్రాల ద్వారా దేవ కట్టా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన తయారు చేసిన కథ కొత్తగా అనిపించడంతో వెంటనే సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఎమోషన్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సాయితేజ్ లుక్ ను .. ఆయన పాత్రను దేవ కట్టా చాలా విభిన్నంగా చూపించనున్నాడని చెబుతున్నారు. కథానాయికలు .. ప్రతినాయకుడు ఎవరు అనే విశేషాలతో పాటు, మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Sai Tej
Subbu
Deva katta Movie
  • Loading...

More Telugu News