New Delhi: నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ.. 38కి పెరిగిన మృతుల సంఖ్య!

Congress Chief Sonia Gandhi met prez Kovind Over Delhi violence

  • ఒక్క రోజు వ్యవధిలోనే 11 మంది మృతి
  • 514 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
  • అమిత్‌షాతో రాజీనామా చేయించాలని రాష్ట్రపతిని కోరిన సోనియా

ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అల్లర్లలో గాయపడిన వారిలో మరో 11 మంది ఒక్కరోజు వ్యవధిలోనే మృతి చెందారు. దీంతో హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 38కి చేరింది. అల్లర్ల ఘటన నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 48 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అల్లర్లపై దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాల (సిట్)ను ఏర్పాటు చేశారు. 514 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని ఆ పార్టీ నేతలు నిన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధాజ్ఞలను నేడు పది గంటలపాటు సడలించనున్నట్టు హోంశాఖ తెలిపింది.

New Delhi
violence
Sonia Gandhi
Amit Shah
  • Loading...

More Telugu News