Kishan Reddy: దేశవ్యాప్తంగా జరిగినప్పుడే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు కూడా ఉంటుంది: కిషన్ రెడ్డి

Kishan Reddy comments on Telugu states assembly seats hike

  • తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా సీట్లు పెంచలేమని స్పష్టీకరణ
  • సీట్ల పెంపుపై న్యాయవిభాగం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
  • విభజన చట్టంలో ఇష్టంవచ్చినట్టు అంశాలను పేర్కొన్నారని వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశవ్యాప్తంగా జరిగినప్పుడే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని తెలిపారు. అంతేతప్ప, తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సీట్ల పెంపు చేపట్టలేమని స్పష్టం చేశారు. అయినా సీట్ల పెంపు అంశం ప్రస్తుతం న్యాయవిభాగం ముందు ఉందని వెల్లడించారు. సీట్ల పెంపు అంశంపై న్యాయవిభాగం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విభజన చట్టంలో ఇష్టం వచ్చినట్టు అంశాలను పొందుపరిచారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Kishan Reddy
Andhra Pradesh
Telangana
Assembly Seats
  • Loading...

More Telugu News