Botsa Satyanarayana: చంద్రబాబు స్వార్థం కోసం చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు: బొత్స

AP misnister Botsa lashes out Chandrababu Uttarandhra visit

  • చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదన్నది చంద్రబాబు ఉద్దేశమన్న బొత్స
  • ఉత్తరాంధ్ర ప్రజలను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల పట్ల వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చంద్రబాబు పర్యటన చేయాలనుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటన ఉండి కూడా అక్కడి ప్రజలను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదన్నది చంద్రబాబు ఉద్దేశమని బొత్స వ్యాఖ్యానించారు.

Botsa Satyanarayana
Chandrababu
North Andhra
Telugudesam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News