Corona Virus: కరోనా సోకిందని తేలితే లక్ష నగదు.. ప్రజలకు చైనా ప్రోత్సాహకం!

China announces cash prize to attracts corona suspects

  • కరోనాతో అతలాకుతలం అవుతున్న చైనా
  • దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించిన వైరస్ మహమ్మారి
  • కరోనా అనుమానితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేందుకు నగదు పథకం

ఇప్పటివరకు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగిన చైనా ఇప్పుడు కరోనా వైరస్ పై యుద్ధం చేస్తోంది. వుహాన్ లో మొదలైన ఈ వైరస్ మహమ్మారి కొన్నివారాల వ్యవధిలోనే దేశంలో చాలా ప్రాంతాలకు వ్యాపించడంతో బాధితుల సంఖ్య లక్షల్లో ఉన్నట్టు భావిస్తున్నారు. అందుకే పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వైరస్ వ్యాప్తిని నిరోధించాలని చైనా కృతనిశ్చయంతో ఉంది.

ఈ క్రమంలో ప్రజలు ఎవరైనా తమకు కరోనా సోకిందని భావిస్తే వారికై వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేందుకు చైనా ప్రభుత్వం ఓ వినూత్న పథకం ప్రకటించింది. కరోనా ఉందని భావించి వచ్చిన వారిలో ఎవరికైనా వైద్యపరీక్షలో వైరస్ ఉందని తేలితే వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి ప్రకటించింది. ఇప్పటికే చికిత్స పొందినవారికి మాత్రం ఈ పథకం వర్తించదట!

  • Loading...

More Telugu News