Chandrababu: విశాఖ ఎయిర్ పోర్టు వెలుపల రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

Chandrababu sits down on road at Vizag airport

  • చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తం
  • చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా పడుకున్న వైసీపీ కార్యకర్తలు
  • వాహనం దిగి నడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన బాబు
  • భద్రతా కారణాలతో వారించిన పోలీసులు
  • మూడు గంటలుగా ఎయిర్ పోర్టు వద్దే నిలిచిపోయిన టీడీపీ అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖపట్నం వచ్చారు. అయితే ఆయన్ను విశాఖలో అడుగుపెట్టనిచ్చేది లేదంటూ వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగడంతో విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు కాన్వాయ్ ను ముందుకు కదలనివ్వకుండా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై అడ్డుగా పడుకున్నారు. దాంతో చంద్రబాబు తన వాహనం దిగి పాదయాత్ర తరహాలో నడిచేందుకు ప్రయత్నించగా పోలీసులు భద్రతా కారణాలను చూపి ఆయనను వారించారు. దాంతో చేసేదిలేక చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. మూడు గంటల క్రితమే ఆయన వైజాగ్ చేరుకోగా, ఇప్పటికీ రోడ్డుపైనే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.

Chandrababu
Vizag
Airport
YSRCP
Protests
Police
  • Loading...

More Telugu News