Thiruchirapalli: ఆలయం వద్ద తవ్వకాలలో బయటపడ్డ 505 బంగారు నాణేలు

505 gold coins found in digging near temple in Tiruchirappalli

  • తిరుచిరాపల్లి జంబుకేశ్వరార్ ఆలయం సమీపంలో తవ్వకాలు
  • క్రీ.శ. 1000-1200 మధ్య కాలానికి చెందిన నాణేలు లభ్యం
  • ఏడు అడుగుల లోతులో లభ్యమైన నాణేలు

తమిళనాడు తిరుచిరాపల్లి (తిరుచ్చి)లోని జంబుకేశ్వరార్ దేవాలయం సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా ఏకంగా 505 బంగారు నాణేలు బయపటడ్డాయి. వీటి మొత్తం బరువు 1.716 కిలోలు. ఇవన్నీ కూడా ఒక పాత్రలో లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ, ఇవి క్రీ.శ. 1000-1200 మధ్య కాలానికి చెందినవని తెలిపారు. వీటిపై అరబిక్ భాషలో ముద్రించారని చెప్పారు. బయటపడ్డ నాణేలలో 504 చిన్నసైజువని, ఒకటి పెద్దదని తెలిపారు. ఏడు అడుగుల లోతులో ఇవి బయటపడ్డాయని చెప్పారు. హిందూ మత సంఘాలు, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వీటిని పోలీసులకు అందజేశామని తెలిపారు. ప్రస్తుతం ఈ నాణేలను ట్రెజరీలో భద్రపరిచారు. ఈ నాణేలపై అధ్యయనం జరగనుంది.

Thiruchirapalli
Jambukeshwarar Temple
Gold Coins
Digging
Tamil Nadu
  • Loading...

More Telugu News