Jemima Rodrigues: డ్రెస్సింగ్ రూమ్ వద్ద సెక్యూరిటీ గార్డుతో కలిసి చిందులేసిన టీమిండియా అమ్మాయి

Team India woman cricketer Jemima Rodrigues dances with off line security guard

  • టి20 వరల్డ్ కప్ లో భారత్ జోరు
  • వరుసగా మూడో విజయం నమోదు
  • డ్రెస్సింగ్ రూంలో ఉల్లాసంగా గడిపిన టీమిండియా క్రికెటర్లు
  • వీడియో పోస్టు చేసిన ఐసీసీ

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా అమ్మాయిలు అదరగొడుతున్నారు. వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. కాగా, న్యూజిలాండ్ తో మ్యాచ్ అనంతరం టీమిండియా మహిళా క్రికెటర్లు ఉల్లాసంగా గడిపారు. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే సమయంలో భారత స్టార్ బ్యాట్స్ ఉమన్ జెమీమా రోడ్రిగ్స్ ఓ మహిళా సెక్యూరిటీ గార్డుతో కలిసి డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ హిట్ సాంగ్ కు వీరిద్దరు చేసిన డ్యాన్స్ అక్కడున్న అందరినీ అలరించింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News