Balakrishna: మార్చి 2 నుంచి సెట్స్ పైకి బాలయ్య

Boyapati Movie

  • విభిన్నమైన కథను సెట్ చేసుకున్న బోయపాటి 
  • ద్విపాత్రాభినయం చేయనున్న బాలయ్య
  • తాజాగా తెరపైకి సోనాల్ చౌహాన్ పేరు

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా మొదలుకాబోతోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సారి బాలయ్యను బోయపాటి సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. గ్రహాలు .. అవి చూపే ప్రభావం ఈ కథలో ప్రధాన అంశంగా కనిపిస్తాయని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని బాలయ్య అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తాజాగా అందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. మార్చి 2వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తొలి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాయలసీమకి చెందినవాడిగా .. కాశీలో అఘోరగా ఆయన కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన సరసన నాయికలుగా శ్రియ .. అంజలి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా సోనాల్ చౌహాన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మూడో హీరోయిన్ కి కూడా ఈ కథలో చోటు ఉందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.

Balakrishna
Shriya
Anjali
Boyapati Sreenu Movie
  • Loading...

More Telugu News