thaman: పవన్ ఫొటోను ప్రొఫైల్ పిక్ గా మార్చుకున్న తమన్‌!

thaman changed his profile picture

  • ఫస్ట్‌సింగిల్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను
  • సినిమా బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేస్తోంది
  • ఉత్తమ సంగీతాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం

సంగీత దర్శకుడు తమన్‌ ట్విట్టర్‌లో పవన్‌ కల్యాణ్ ఫొటోను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకున్నారు. 'లవ్‌ యూ ఆల్‌. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్ వచ్చేస్తుంది' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. పవన్‌కు తాను అతిపెద్ద అభిమానినన్నారు.

ఫస్ట్‌సింగిల్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ సినిమా కోసం సినిమా బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. ఇది తమకే కాకుండా అందరికీ ఎంత ముఖ్యమో బాగా తెలుసని చెప్పారు. ఉత్తమ సంగీతాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

దీంతో పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. #PSPK26FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌ ఇండియాలో ట్రెండింగ్‌తో దూసుకెళ్లిపోతోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తున్న కొత్త సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ త్వరలోనే విడుదల కానుంది.

thaman
Pawan Kalyan
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News