Surya: మరోసారి జట్టు కడుతున్న హిట్ కాంబినేషన్

Gautham Menon Movie

  • సూర్యకి విపరీతమైన క్రేజ్ 
  • గౌతమ్ మీనన్ కి మంచి ఇమేజ్ 
  • ఇద్దరి కాంబినేషన్లో మూడో మూవీ  

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయకుడిగా సూర్యకి మంచి క్రేజ్ వుంది. అలాగే దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి మంచి ఇమేజ్ వుంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో 'కాక కాక' .. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలు వచ్చాయి. వైవిధ్యభరితమైన చిత్రాలుగా ఈ రెండు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. అలాంటి ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది.

సూర్య కోసం గౌతమ్ మీనన్ ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశాడట. ఇంతవరకు సూర్య చేయని పాత్రను ఆయన డిజైన్ చేశాడని చెబుతున్నారు. వారం పది రోజుల్లో ఈ కథను సూర్యకు వినిపించనున్నాడని సమాచారం. ఆల్రెడీ లైన్ వినేసి ఓకే చెప్పిన సూర్య, పూర్తి కథను వినేసిన తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం ఖాయమని చెబుతున్నారు. గౌతమ్ మీనన్ పట్ల సూర్యకి గల ప్రత్యేక అభిమానం ఈ ప్రాజెక్టును ఓకే చేయడానికి మరో కారణమని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News