Nalgonda District: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

Road accident in Nalgond District

  • అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయిన కారు
  • ప్రమాదంలో భర్త, భార్య, కుమార్తె దుర్మరణం
  • బాలుడిని రక్షించిన స్థానికులు

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఓ కారు రోడ్డు పక్కన ఉన్న పీఎంఆర్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, ఒక్క బాలుడిని మాత్రమే వారు రక్షించగలిగారు. ఈ ఘటన పీఏ పల్లి మండలం దుంగ్యాల వద్ద చోటు చేసుకుంది. మృతులు పీఏ పల్లి మండలం వడ్డెరగూడేనికి చెందిన ఓర్సు రఘు, ఆయన భార్య అలివేలు, కుమార్తె కీర్తిగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Nalgonda District
Accident
PA Palli Mandal
  • Loading...

More Telugu News