Krishna District: నూజివీడు ట్రిపుల్ ఐటీ సమీపంలో దారుణం.. తండ్రి కోసం ఎదురుచూస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

Man Raped minor girl in Nuziveedu

  • బయటకు వెళ్లిన తండ్రి రాకపోవడంతో రోడ్డుపైకి వచ్చి ఎదురుచూపు
  • బెదిరించి అత్యాచారం చేసిన నిందితుడు
  • నిందితుడి కోసం రంగంలోకి ప్రత్యేక బలగాలు

తండ్రి కోసం ఎదురుచూస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడో కామాంధుడు. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ సమీపంలో జరిగిందీ దారుణం. రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించిన బాలికను చూసిన పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులు ఆరా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికను ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

నూజివీడుకు చెందిన వ్యక్తి పనిపై బయటకు వెళ్లి రాత్రయినా తిరిగి రాకపోవడంతో కంగారు పడిన కుమార్తె రోడ్డుపైకి వచ్చి ఎదురుచూడసాగింది. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న నిందితుడు ఆమెను బెదిరించి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ట్రిపుల్ ఐటీ సమీపంలో వదిలేసి పరారయ్యాడు. రోడ్డుపై ఏడుస్తూ బాలిక పోలీసుల కంట పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం వేట ప్రారంభించారు.

Krishna District
Nuziveedu
girl
rape
Crime News
  • Loading...

More Telugu News