Mangalagiri: నీరుకొండపై అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయండి: జగన్‌కు ఆర్కే లేఖ

Mangalagiri MLA RK Writes letter to CM Jagan

  • వంద అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయండి
  • చంద్రబాబు హయాంలోనే ప్రతిపాదన
  • స్మృతివనం పనులు ఆగిపోయాయని పేర్కొన్న ఆర్కే

నీరుకొండపై అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐనవోలులో 20 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుతోపాటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆర్కే ఈ లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం స్మృతివనం పనులు ఆగిపోయాయని తెలిపారు. నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, ఇప్పుడా స్థానంలో వంద అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

Mangalagiri
MLA RK
YS Jagan
Ambedkar Statue
Neerukonda
  • Loading...

More Telugu News