Actress Sri Reddy: కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ నుంచి ప్రాణహాని.. పోలీసులకు శ్రీరెడ్డి ఫిర్యాదు

Actress Sri Reddy files case againt Karate Kalyani and Rajesh

  • శ్రీరెడ్డి.. కరాటే కల్యాణి, రాకేశ్ మధ్య ముదురుతున్న వార్
  • ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
  • చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శ్రీరెడ్డి ఫిర్యాదు

నటి కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరాటే కల్యాణి, రాకేశ్‌లు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. చెన్నైలో తాను కారు, ఇల్లు కొనుక్కున్నానని, దీనిపై వారు తప్పుడు ప్రచారం చేస్తూ అసభ్య పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పెట్రోలు పోసి తగలబెడతామని తనను బెదిరిస్తున్నారని, అందుకనే పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించింది.  

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తమపై అసభ్యకర పోస్టులు చేసిందని ఆరోపిస్తూ నటి కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వీరిద్దరిపై కేసు పెట్టడం గమనార్హం.

Actress Sri Reddy
Karate Kalyani
Dance master Rajesh
Tollywood
  • Loading...

More Telugu News